తెలంగాణ

telangana

ETV Bharat / state

తొమ్మిదిన్నరేళ్ల ప్రగతే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు - తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాలు

BRS Assembly Elections Campaign Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని సామాజిక వర్గాల ఓటర్లను ఆకర్శించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గులాబీ దళపతి దిశానిర్దేశంతో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పదేళ్ల ప్రగతిని వివరిస్తున్న అభ్యర్థులు.. కారు గుర్తుకు ఓటేసి మరోసారి బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
BRS Assembly Elections Campaign 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 9:33 AM IST

Updated : Nov 6, 2023, 10:09 AM IST

తొమ్మిదిన్నరేళ్ల ప్రగతే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు

BRS Assembly Elections Campaign Telangana 2023 : సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో బోడుప్పల్‌లో మంత్రికి నిరసన సెగ తగిలింది. అయోధ్యనగర్‌ కాలనీ వాసులు మంత్రి‌ కారుకు అడ్డుగా వెళ్లి తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.

BRS candidates campaign in Telangana 2023 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పలువురు యువకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎమ్ఎమ్ఐ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి.. నియోజకవర్గ అభ్యర్థి సునీతారెడ్డితో పాటు మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. సునీతరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. మెదక్ జిల్లా హవేలీ గణపుర్ మండలంలో బీఆర్ఎస్అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు

CM KCR Assembly Elections Campaign 2023 : సీఎం కేసీఆర్ బరిలో దిగనున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్‌ షో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ప్రచారానికి వెళ్లిన జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండేకు నిరసన సెగ తగిలింది. గ్రామాభివృద్ధిపై హన్మంత్‌ షిండేను స్థానికులు నిలదీశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ ఓ వైపు వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. మరోవైపు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

సొంత పార్టీల్లో రేగుతున్న చిచ్చు బుజ్జగింపులతో బిజీగా ఉన్న అభ్యర్థులు

Telangana Assembly Elections 2023 : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి.. జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నకిరేకల్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చిన్నకాపర్తిలో కోమటిరెడ్డి సోదరులపై లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. మరోసారి బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలని కోరారు.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

నేడు కొత్తగూడెం, ఖమ్మంలో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలు - హాజరుకానున్న సీఎం కేసీఆర్

Last Updated : Nov 6, 2023, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details