తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Assembly Elections Campaign 2023 : హ్యాట్రిక్‌ లక్ష్యంగా గులాబీ ప్రచార హోరు.. నామినేషన్లకు ముందే విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి అభ్యర్థులు - తుమ్మలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

BRS Assembly Elections Campaign 2023 : మూడోసారి గెలుపే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి ప్రజాక్షేత్రంలో ముమ్మర ప్రచారం చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలవ్వకపోయినా.. విజయం కోసం అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గాల్లో గడప గడపకూ తిరుగుతూ.. కేసీఆర్‌ భరోసా పథకాలను వివరిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మితే మోసపోవటం ఖాయమని హెచ్చరిస్తూనే.. కేసీఆర్‌ రాష్ట్రానికి శ్రీరామరక్ష అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

BRS Elections Campaign 2023
BRS Election Campaign Arrangements in Earnest

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 9:17 PM IST

BRS Election Campaign Arrangements in Earnest హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా గులాబీ ప్రచారహోరు.. నామినేషన్లకు ముందే గెలుపు కోసం కసరత్తులు

BRS Assembly Elections Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో గెలిచి.. అధికార పీఠం మరోసారి కైవసం చేసుకునే దిశగా బీఆర్​ఎస్ కసరత్తులు ముమ్మరం చేసింది. ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలతో గులాబీ అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు మేనిఫెస్టోను(BRS Manifesto) జనాల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నారు.

BRS Campaign in Telangana Assembly Elections : అభివృద్ధి నినాదం.. విపక్షంపై విమర్శల వాదం.. ప్రచారంలో కారు జోరు

బాన్సువాడలో కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా వర్ని నుంచి భారీ ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీ ద్విచక్రవాహన ర్యాలీ(Two Wheeler Rally) నిర్వహించారు. మావల నుంచి డైట్‌ మైదానం వరకు ప్రదర్శన చేపట్టారు. పట్టణంలో ఎటుచూసినా.. గులాబీ జెండాలు కనిపించాయి.

Minister Puvvada Ajay Fires on Thummala :నారాయణపేట నియోజకవర్గ గ్రామాల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతి రెడ్డి నారాయణపేటలో పలు వార్డుల్లో గడపగడపకు తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఖమ్మం జిల్లా ప్రజలు తుమ్మల నాగేశ్వరరావు కల్లబొల్లి మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. మంత్రి తుమ్మలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎంపీ నామా నాగేశ్వరరావు సహా ఉమ్మడి ఖమ్మం బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.

ఖమ్మం జిల్లా ప్రజలు తుమ్మల నాగేశ్వర్ రావు కల్లబొల్లి మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. నీవల్ల బీఆర్​ఎస్ పార్టీ లేదు.. నీవల్ల తెలంగాణ రాలేదు. ఓడిపోయిన నీకు పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్​ను అన్ని మాటలు అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది. నిన్నటి వరకు పంచన ఉండి.. అన్నీ అనుభవించి ఇవాళ కేసీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్న నీకు ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. మీ అహంకార వైఖరిని ఖమ్మం ప్రజలు ఇదివరకే చూశారు. -పువ్వాడ అజయ్‌ , రవాణా శాఖ మంత్రి

BRS Campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. ప్రజల్లో జోష్​ నింపుతున్న ముగ్గురు నాయకులు

Minister Gangula Comments On Opposition Parties : నిజామాబాద్‌లో పలు డివిజన్లలో అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసి ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో దివ్యాంగుల ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

పదేళ్లుగా అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తనను మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీలకు(BJP) ఓటు వేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి పోతారనిమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల(RTC Employees) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన సిబ్బంది సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కరీంనగర్ ప్రగతి చూడండి. అంతకు ముందున్న పార్టీలు చేసిన ప్రాంత అభివృద్ధిని చూడండి. అక్కడే మీకు స్పష్టంగా అర్థమౌతుంది. నేను అబద్ధం చెప్తే నాకు ఓట్లు వేయకండి. ఒక్క ఛాన్స్ అంటూ విపక్షాలు చేస్తున్న మాటలకు ప్రజలు స్వస్తి పలకాలి. యాభై ఏళ్లు పరిపాలించిన పార్టీలు మళ్లీ వచ్చాయి. ఓటర్లంతా ఆచితూచి అడుగేయాల్సిన సమయం ఇది. ఇప్పుడు కానీ ఒక్క తప్పు జరిగితే.. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి పోతాం. - గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమ మంత్రి

Harish Rao Speech at BRS Public Meeting Adilabad : కాంగ్రెస్​ రెండో జాబితా వచ్చాక.. బీఆర్​ఎస్​ సెంచరీ ఖాయమని ఫిక్సయ్యాం : హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details