తెలంగాణ

telangana

Brother Anil: మాట ఇచ్చానంటే తప్పుకోను.. పార్టీ పెట్టాలనే డిమాండ్​ ఉంది: బ్రదర్​ అనిల్​

By

Published : Mar 14, 2022, 1:51 PM IST

Updated : Mar 14, 2022, 2:25 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని మేఘాలయ హోటల్‌లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ భేటీ అయ్యారు. కొత్త రాజకీయ పార్టీ పెడతారన్న ప్రచారంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Brother Anil Meeting
Brother Anil Meeting

Brother Anil Meeting: వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారని.. వారి సమస్యలు పట్టించుకునే వారు లేరని విశాఖలో బ్రదర్​ అనిల్​కుమార్​ అన్నారు. ఏపీ విశాఖలోని ఓ హోటల్​లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ అనంతరం మాట్లాడిన అనిల్​.. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి జగన్​ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అయితే తాను, జగన్​ బిజీగా ఉండటం వల్ల.. రెండున్నరేళ్లుగా కలవలేదన్నారు. సమయం కుదిరినప్పుడు కచ్చితంగా కలుస్తానన్నారు. తనను కలిసినవాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చానని.. మాట ఇస్తే కచ్చితంగా వెనక్కి తగ్గకుండా నిలబడతానన్నారు. మరోవైపు పార్టీ పెట్టాలనే డిమాండ్​ ఉందని కూడా తెలిపారు.

వారం క్రితం విజయవాడలో..

వారం క్రితం బ్రదర్ అనిల్ విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయితే కొత్త పార్టీ పెడతామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారాయన. సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశామని.. కానీ.. ఆయనతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదని ఆ సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత శొంఠి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామన్న నాగరాజు.. త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని వారు తెలిపారు. ఇదే భేటీలో జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Last Updated : Mar 14, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details