Brother Anil Comments: తమ రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వాలు పథకాలను అందిస్తున్నాయని.. వాటిపై ప్రజలెవరు ఆధారపడొద్దని బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలోని క్రైస్ట్ కేర్ అండ్ మినిస్ట్రీస్ క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన కూడికలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని వ్యాఖ్యానించారు.
ప్రజలకు పక్క రాష్ట్రంలో పుట్టిన బాగుండనే భావన వచ్చింది: బ్రదర్ అనిల్ - Brother Anil indirect comments
Brother Anil Comments: రాష్ట్ర ప్రభుత్వంపై ఫాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం స్వార్థం కోసం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దని ఆయన వ్యాఖ్యనించారు.
anil
రాష్ట్ర ప్రజలకు ఏపీలో కాకుండా పక్కరాష్ట్రంలో పుట్టిన బాగుండుననే భావన ఏర్పడిందన్నారు. తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించలేదు. కేవలం ప్రభుత్వం, ప్రభుత్వాలు అంటూ తన దైవ వాక్యం మధ్యలో పలుకుతూ పలు వ్యాఖ్యలు చేశారు. బ్రదర్ అనిల్ గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి: