తెలంగాణ

telangana

ETV Bharat / state

BRONCHUS International conference : యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో బ్రాంకస్‌-2021 సదస్సు - యశోద ఆస్పత్రి

ఆయుర్వేదం, నాచురోపతి వంటి పద్ధతులను.. అల్లోపతి కోసం పక్కన పెట్టడం సరికాదని... చిన జీయర్‌ స్వామి సూచించారు. యశోద ఆస్పత్రులు నిర్వహించిన బ్రాంకస్‌ 2021 (BRONCHUS International conference).. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Sri Tridandi Chinna Jeeyar Swami
Sri Tridandi Chinna Jeeyar Swami

By

Published : Nov 28, 2021, 3:13 PM IST

BRONCHUS International conference: ప్రస్తుత పరిస్థితుల్లో అల్లోపతితో పాటు, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి వంటి వైద్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వైద్యానికి ప్రాముఖ్యత పెరిగిందని అన్నారు. యశోద ఆస్పత్రులు నిర్వహించిన బ్రాంకస్‌ 2021.. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రుల సేవలను కొనియాడారు.

కృత్రిమ వస్తువులు, కాలుష్యం కారణంగా... ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోకుండా.. వైద్య పరంగా మందులు ఇస్తూ పోవడం సరికాదని... చిన జీయర్‌స్వామి (Sri Tridandi Chinna Jeeyar Swami) పేర్కొన్నారు. శ్వాసకోశ వ్యాధులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా... నేటితో ముగియనుంది. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యశోదా ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీఎస్ రావు, డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, సీనియర్ ఇంటర్వేన్షల్ పల్మనాజిస్ట్ డాక్టర్ హరి కృషన్ సహా పలువురు వైద్యులు హాజరయ్యారు.

ఇదీ చూండండి:Health benefits of Amla: ఉసిరి.. ఔషధ సిరి.. సర్వదోష హరిణి.!

ABOUT THE AUTHOR

...view details