Ktr tweet Today: బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో పురపాలక, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టాలరేట్ ఇండియా అంటూ ట్వీట్ చేసిన ఆయన.. బ్రిటన్ ప్రధాని రాజీనామా వార్త సంతోషం కలిగించిందని అన్నారు. తన ఆర్థికవిధానం విఫలమైనందుకు 45 రోజుల తక్కువ వ్యవధిలోనే లిజ్ ట్రస్ రాజీనామా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. 30 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం.. ప్రపంచంలోనే అధిక ఎల్పీజీ ధర, రూపాయి అత్యంత తక్కువ విలువకు పడిపోయేలా చేసిన ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
బ్రిటన్ ప్రధాని రాజీనామా.. మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ - KTR Twitter Latest News
Ktr tweet Today: మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రాజీనామా వార్త సంతోషం కలిగించిందని అంటూనే.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అధిక ఎల్పీజీ ధర, రూపాయి అత్యంత తక్కువ విలువకు.. పడిపోయేలా చేసిన ప్రధాని దేశంలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ktr twitter