తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అంటే తనకు ఎంతో ఇష్టమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ అండర్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. చిలకలగూడలోని కట్టమైసమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణ, స్థానిక కార్పొరేటర్ హేమ ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతి ఏటా జరిగే బోనాల జాతరను ఎంతో ఆస్వాదిస్తానని తెలిపారు. తొట్టెల ఊరేగింపు, పలహార బండి ఊరేగింపులో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బోనాల జాతరలో తిరుగుతూ పలువురితో సెల్ఫీలు దిగి సందడి చేశారు.
బోనాల జాతరలో పాల్గొన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ - సందర్శించిన
తెలంగాణ బోనాల జాతర అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయం అంటే తనకు ఎంతో ఇష్టమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ అండర్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
బోనాల జాతరను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
Last Updated : Jul 29, 2019, 9:09 AM IST