తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా జలాల వివాదం.. నేటి నుంచి బ్రిజేష్‌ ట్రైబ్యునల్ విచారణ - తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రగులుతూనే ఉంది. ఈ క్రమంలో నేటి నుంటి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్.. ఈ సమస్యపై విచారణ చేపట్టనుంది. తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ.. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్‌ ఘనశ్యాంజా సాక్షిగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్ తీర్పు చెప్పనుంది.

brijesh-kumar-tribunal-hearing-from-today-in-telugu-states
కృష్ణా జలాల వివాదం.. నేటి నుంచి బ్రిజేష్‌ ట్రైబ్యునల్ విచారణ

By

Published : Mar 17, 2021, 9:17 AM IST

కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి ఏర్పాటైన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్... నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వాదనలపై విచారణ చేపట్టనుంది. 2019 ఆగస్టు తర్వాత తొలిసారి ట్రైబ్యునల్‌ సమావేశం నిర్వహించనుంది.

తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ దాఖలైన ఓ అఫిడవిట్​కు సంబంధించి వాదనలు జరగనున్నాయి. ఏపీ తరఫు న్యాయవాది ఈ విషయంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుపై ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పనుంది.

ఇదీ చదవండి:కొవిడ్‌ కాలంలో పెరిగిన బాల్య వివాహాలు

ABOUT THE AUTHOR

...view details