తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక - అమరావతి రైతుల ఆందోళన

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గ్రామాల్లో రాజుకున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది. మరింత ఉద్ధృతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు రాజధానివాసులు ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. బుధవారం తుళ్లూరులో జరిగిన ఓ వివాహ వేడుక నిరసనకు వేదికైంది.

bride-and-groom-an-innovative-protest-for-amravati in ap
వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక

By

Published : Feb 26, 2020, 3:09 PM IST

అమరావతే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలనే డిమాండ్‌తో రాజధాని ప్రజలు 71 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. పండగలు, వేడుకల్లో సైతం రాజధాని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుక...... అమరావతి నినాదానికి వేదికయ్యింది. వధూవరులు, బంధుమిత్రులంతా ప్లకార్డులు చేతబట్టుకుని తమ అభీష్టాన్ని తెలియజేశారు. కల్యాణ మండపంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక

ఇదీ చదవండి'అమరావతిలో ఉద్యమం చేసేది రైతులు కాదు'

ABOUT THE AUTHOR

...view details