తెలంగాణ

telangana

ETV Bharat / state

'చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఉపయుక్తం' - Brest feeding center open in secundrabad

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో తల్లి తన బిడ్డకు పాలిచ్చే కేంద్రాన్ని డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా, రోటరీ జిల్లా గవర్నర్ హనుమంతరెడ్డి ప్రారంభించారు. చిన్న పిల్లలతో ప్రయాణం చేసే మహిళలకు ఈ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని వారు తెలిపారు.

'చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఉపయుక్తం'
'చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఉపయుక్తం'

By

Published : Feb 23, 2021, 3:42 PM IST

తల్లి తన బిడ్డకు పాలిచ్చే కేంద్రాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాన్ని ఇవాళ డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా, రోటరీ జిల్లా గవర్నర్ హనుమంతరెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో ప్లాట్ ఫారం నంబర్ 10లో ప్రారంభించారు.

చిన్న పిల్లలతో ప్రయాణం చేసే మహిళలకు ఈ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని వారు తెలిపారు. ద.మ.రైల్వేలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్​లో ప్రయాణికుల కోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామమని డీఆర్ఎం అభయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రెండు నెలల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరో రెండు కేంద్రాలను నాంపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'

ABOUT THE AUTHOR

...view details