రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఏఐజీ(AIG Hospitals awareness program) హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళల్లో క్యాన్సర్(breast cancer) రోగ నిర్ధారణ, కమ్యూనిటీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. రోడ్ థ్రిల్ ఆర్గనైజేషన్ ఆల్-బైకర్స్ క్లబ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన పింక్ రిబ్బన్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
AIG awareness program: 'రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాం' - తెలంగాణ వార్తలు
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఏఐజీ(AIG HOSPITALS) హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పింక్ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం, ఏఐజీ బైక్ ర్యాలీ
రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పింక్ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ దాదాపు 25 కిలోమీటర్లు మేర సాగింది. మహిళా రైడర్స్, డాక్టర్లు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:KRMB meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం