అంధులకోసం ప్రత్యేక లిపి కావాలని తపించి బ్రెయిలీని సృష్టించిన ప్రముఖుడు డాక్టర్ లూయీస్ బ్రెయిలీ 211వ జయంతి ఉత్సవాలు నగరంలో ఘనంగా సాగాయి. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీఎన్జీఓస్ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అంధులైన పలువురు ఉద్యోగులు పాల్గొని.. బ్రెయిలీ కృషిని కొనియాడారు. అంధ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నుంచి మినహాయింపును కొనసాగించేలా కృషి చేస్తామని కారం రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఘనంగా బ్రెయిలీ 211వ జయంత్యుత్సవాలు - ఘనంగా బ్రెయిలీ 211వ జయంత్యుత్సవాలు
విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ లూయీస్ బ్రెయిలీ 211వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా బ్రెయిలీ 211వ జయంత్యుత్సవాలు