తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 22 నుంచి బ్రాహ్మణ ఏక్తా బస్సుయాత్ర - brahmana yatra

ఐక్యతే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలను ఏకతాటిపై తీసుకొస్తామని తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐకాస తెలిపింది. బ్రాహ్మణ ఏక్తా యాత్ర పేరుతో ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈనెల 22 నుంచి బ్రాహ్మణ ఏకతా బస్సుయాత్ర

By

Published : Jul 21, 2019, 9:00 PM IST

Updated : Jul 22, 2019, 12:02 AM IST

బ్రాహ్మణులకు తగిన గుర్తింపు అందించాలనే లక్ష్యంతో... ఐకాస ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ ఏక్తా యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం తెలిపింది. జులై 22న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు ఐకాస రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ వై.పవన్ కుమార్ శర్మ తెలిపారు. 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించి ఆయా జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఆగస్టు 1న హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సంప్రదాయ విలువలకు పునరుజ్జీవం తెచ్చే దిశగా ప్రయత్నిస్తూనే... పౌరోహిత్యం, స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై బ్రాహ్మణ కుటుంబాలకు అవగాహన కల్పిస్తామన్నారు. యాత్రలో అధ్యయనం చేసిన వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుతామని వివరించారు.

ఈనెల 22 నుంచి బ్రాహ్మణ ఏకతా బస్సుయాత్ర
Last Updated : Jul 22, 2019, 12:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details