Chaganti Koteswara Rao: భక్తి తల్లిలాంటిదని.. భక్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. ఏపీ విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో... దేవీవైభవతత్వంపై ఆయన ప్రవచనం చేశారు. అమ్మవారిని ఉపాసన చేయడమంటే అమ్మను పూజించడమేనని అన్నారు. ధర్మం అనే పదానికి తుల్యమైన పదం మరొకటి లేదని..ధర్మాన్ని ఆచరించే వారిని ఆ తల్లి ఎల్లవేళలా ఉద్దరిస్తుందన్నారు. కేవలం చూపులతోనే ఆ లోకమాత సమస్త జీవకోటిని పోషిస్తోందన్నారు. త్యాగానికి, ఓదార్పుకు ప్రతిరూపం అమ్మ అన్న చాగంటి.. తల్లిని గౌరవించే వారు ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. భారతీయ జీవన విధానం వేద సంస్కృతితో ముడిపడి ఉందని, వేదం భక్తిమార్గాన్ని బోధిస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
Chaganti Koteswara Rao: 'భక్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు'
Chaganti Koteswara Rao: భక్తి తల్లి లాంటిదని, భక్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. అమ్మవారిని ఉపాసన చేయడమంటే, అమ్మను పూజించటమేనని వ్యాఖ్యానించారు.
Chaganti Koteswara Rao