తెలంగాణ

telangana

ETV Bharat / state

Door to Door Petrol Delivery : ఇంటి వద్దకే పెట్రోల్‌.. విజయవాడలో ప్రారంభించిన బీపీసీఎల్‌ - విజయ వాడ వార్తలు

Door to Door Petrol Delivery : ఏపీలోని విజయవాడలో యాప్ ద్వారా బుక్​ చేసుకున్న వారికి ఇంటి వద్దే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. మంగళవారం గాంధీనగర్ పెట్రోల్​ బంకు వద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Door to Door Petrol Delivery
ఇంటింటికి పెట్రోల్

By

Published : Dec 29, 2021, 2:13 PM IST

Door to Door Petrol Delivery : ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి ఇంటివద్దకే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తామని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) సౌత్‌ డీజీఎం పి.పి.రాఘవేంద్రరావు, ఏపీ, తెలంగాణ డీజీఎం భాస్కరరావు ప్రకటించారు. మంగళవారం గాంధీనగర్‌ పెట్రోల్‌ బంకువద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘బీపీసీఎల్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, పెట్రోల్‌ను బుక్‌ చేసుకోవచ్చని వారు తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫెసో క్యాన్‌ ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తామని, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని వివరించారు. గాంధీనగర్‌లోని బంకు వద్ద సిబ్బందితో సంబంధం లేకుండానే స్కాన్‌ చేసి, వినియోగదారుడే పెట్రోల్‌ నింపే సౌకర్యం ఉందని వెల్లడించారు. ఈ పద్ధతి ద్వారా మోసాలను అరికట్టవచ్చని, 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని చెప్పారు. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ నెల రోజులపాటు ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:'మోదీ కొత్త కారు రూ.12 కోట్లు కాదు.. ఇంతే...'

ABOUT THE AUTHOR

...view details