తెలంగాణ

telangana

ETV Bharat / state

భవనం పైనుంచి పడి బాలుడి మృతి - boy search fo kite in hyderabad

చెట్టుకు తట్టుకున్న గాలిపటాన్ని తీసే క్రమంలో ఓ బాలుడు మూడు అంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్​లోని మోండా మార్కెట్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఓంకార్

By

Published : Nov 12, 2019, 11:46 PM IST

Updated : Nov 12, 2019, 11:55 PM IST

కర్ణాటకు చెందిన ఉమేశ్​ కుమార్​ దంపతులు హైదరాబాద్​ మోండా మార్కెట్​ పీఎస్​ పరిధిలోని సెకండ్​ బజార్​లో నివాసం ఉంటున్నారు. వీరికి ​ ఇద్దరు కుమారులు. కార్తిక పౌర్ణమికి సెలవు కావడం వల్ల పెద్ద కుమారుడు ఓంకార్​ భవనంపై నుంచి గాలిపటం ఎగరేశాడు. గాలి పటం చెట్టుకు చిక్కుకోవడం వల్ల దాన్ని తీసేందకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రాణం తీసిన గాలిపటం..
Last Updated : Nov 12, 2019, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details