Boy Dies in Dogs Attack Shaikpet : హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. సంచులు పట్టుకుని వస్తుంటే చాలు వెంటాడుతూ పరుగెత్తిస్తున్నాయి. బైకులపై వచ్చే వాళ్లకూ భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులకు తెగబడిపోతున్నాయి. రాత్రి వేళ్లల్లోనైతే పట్టాపగ్గాలే ఉండవు. ఏవో రౌడీ గల్లీల్లో దర్జాగా గర్జిస్తూవీధి శునకాలు(Street Dogs in Hyderabad ) దౌర్జన్యం చేస్తున్నాయి.
Street Dogs Attack in Five Months Old Boy in Hyderabad :కుక్కల భయంతోఇంట్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే శునకాల దాడి(Stray Dogs Attack)లో పలు చోట్ల ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎందరో పిల్లలు గాయాలపాలయ్యారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. షేక్‌పేట వినోబా నగర్‌లో ఈ నెల 8న గుడిసెలో నిద్రిస్తున్న 5 నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి (Dogs Attack Shaikpet)చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించంగా చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందాడు.
వీధి కుక్కల దాడిలో.. బాలికకు తీవ్రగాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :అంజి, అనూష దంపతులు వినోబానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 8న వారు తమ ఐదు నెలల బాలుడిని గుడిసెలో ఉంచి కూలీకి వెళ్లారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లిదండ్రులు వచ్చే చూసేసరికి చిన్నారి రక్తపు మడుగులో ఏడుస్తూ కన్పించాడు. వెంటనే వారు బాలుడు శరత్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.