తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమంటూ లొంగదీసుకున్నాడు.. పెళ్లంటే పరారయ్యాడు - bachupally police station

భార్యా పిల్లలు ఉండగా మరో యువతిని మోసం చేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఓ యువతిని ప్రేమిస్తున్నా అన్నాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్ల తిరిగారు. పెళ్లి చేసుకుందాం... అనగానే మొహం చాటేశాడు. భార్యాపిల్లలు ఉన్నా అతనితో పెళ్లి చేయాలని ఆ యువతి బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది.

boy cheated a girl at bachupally
భార్యాపిల్లలు ఉన్నా అతన్నే పెళ్లి చేసుకుంటా...

By

Published : Feb 13, 2020, 1:37 PM IST

ప్రేమంటూ లొంగదీసుకున్నాడు.. పెళ్లంటే పరారయ్యాడు

ప్రేమించిన వాడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ... ఓ యువతి పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించిన ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసముండే ఒక కుటుంబం కూకట్​పల్లి జేఎన్​టీయూ సమీపంలో హోటల్ నడుపుతోంది. బాచుపల్లికి చెందిన ఆటోడ్రైవర్ రవి గౌడ్ హోటల్​కు అవసరమైన సరుకులు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని కుమార్తెతో చనువు ఏర్పడింది. ఆమెతో కొన్నేళ్లుగా ప్రేమయాణం సాగించాడు. వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. యువతి తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. రవి మొహం చాటేశాడు.

అతనికి అప్పటికే వివాహమై భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయినా అతడితోనే వివాహం జరిపించాలని బాధితురాలు బాచుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. స్టేషన్​కు రాకముందే ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని, ప్రస్తుతం అమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భార్యాపిల్లలు ఉన్నా అతన్నే పెళ్లి చేసుకుంటా...

ఇదీ చదవండి:దిల్లీ నూతన ఎమ్మెల్యేల్లో 50 శాతానిది ఆ నేపథ్యమే

ABOUT THE AUTHOR

...view details