తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టుమని పదేళ్లు లేవు.. కానీ ఈ బాలుడి ప్రతిభ చూస్తే ఎవరైనా షాక్​ అవ్వాల్సిందే - boy eloquently recite BhagavadGita

boy can eloquently recite Bhagavad Gita: పట్టుమని పదేళ్లు లేని ఆ బాలుడు భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా చెప్పగలడు. పండిత భాషగా చెప్పుకునే సంస్కృత పదాలను ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా భావావేశంతో పలకగలడు. చిన్ననాటి నుంచే హిందూ సనాతన ధర్మం, సంప్రదాయాలకు ఆకర్షితుడైన ఆ బుడతడు అసాధారణ ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించాడు.

ఈ బాలుడి ప్రతిభ చూస్తే ఎవరైనా షాక్​ అవల్సిందే
ఈ బాలుడి ప్రతిభ చూస్తే ఎవరైనా షాక్​ అవల్సిందే

By

Published : Nov 20, 2022, 3:40 PM IST

కానీ ఈ బాలుడి ప్రతిభ చూస్తే ఎవరైనా షాక్​ అవల్సిందే

boy can eloquently recite Bhagavad Gita: బాలాజీ, మంజుశ్రీ దంపతుల గారాలపట్టి పటాకుల ప్రజిత్‌ ఎనిమిదేళ్ల బుడతడు. తన వయసుకు మించి భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయడమే కాదు.. తెలుగులో అర్థాలను విడమర్చి చెప్పగలడు. ఆరున్నరేళ్ల వయసులో నేర్చుకోవడం మొదలుపెట్టిన ప్రజిత్‌18 అధ్యాయాల్లోని 220కి పైగా శ్లోకాలను అవలీలగా చెప్పగల నేర్పరి. 29 నిమిషాల్లోనే 120కి పైగా శ్లోకాలను ఎలాంటి తత్తరపాటుకు గురికాకుండా పారాయణం చేసి ఇండియా బుక్‌ఆఫ్‌రికార్డ్‌లో తన పేరు లిఖించుకున్నాడు.

తక్కువ వయసులో భగవద్గీత శ్లోకాలను అర్థవంతంగా చెప్పిన బాలుడిగా ప్రజిత్‌ రికార్డుల్లోకెక్కాడు. అమెరికాలో ఉన్నపుడే మంజుశ్రీ హిందూ సంస్కృతి, సంప్రదాయ విలువలను తెలియజెప్పే లక్ష్యంతో వారి పెద్దకుమారుడికి భగవద్గీత శ్లోకాలను నేర్పించేది. అదే అభిరుచి చిన్న కుమారుడు ప్రజిత్‌ వంటపట్టించుకున్నాడు. తల్లితో పాటు గురువు నిర్మల ప్రోత్సాహంతో కొద్దికాలానికే శ్లోకాల్లో ఆరితేరాడు.

నాలుగు నెలల్లో 220 శ్లోకాలను నేర్చుకుని అబ్బురపరిచాడు. ప్రజిత్‌ప్రతిభ గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నల్లగండ్ల అపర్ణ గృహ సముదాయంలోని బాలగోకులంలో ప్రజిత్‌ను చేర్పించారు. అక్కడ ప్రజిత్‌ఆసక్తిని గమనించిన టీచర్‌నిర్మల శ్లోకాలను నేర్చుకోవడంలో ప్రోత్సహించింది. ఆమె నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజిత్‌శ్రద్దగా నేర్చుకుని అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details