కరోనా కష్టకాలంలో కూడా మార్కెట్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టిఎన్ శ్రీనివాస్ చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్ విషయంలో ప్రధానితో ప్రశంసలు పొందటం తాము సాధించిన విజయమని తెలిపారు. మార్కెట్ కమిటీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లును సగానికి తగ్గించాం: టీఎన్ శ్రీనివాస్
పది టన్నుల కూరగాయల వ్యర్ధాలను ఉపయోగించి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విద్యుత్ ఉపయోగించుకుని కరెంటు బిల్లును సగానికి తగ్గించామన్నారు.
విద్యుత్ బిల్లును సగానికి తగ్గించాం: టిఎన్ శ్రీనివాస్
కూరగాయల సరఫరా ఎక్కువవడంతో ధరలు తగ్గాయని చెప్పారు. ప్రతిరోజు పది టన్నుల వ్యర్ధాలను ఉపయోగించి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఆ విద్యుత్‌ను మార్కెట్లోనే ఉపయోగించి కరెంటు బిల్లును సగానికిపైగా తగ్గించామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలవటంతో పట్టభద్రులు తమ వైపే ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు.
ఇదీ చదవండి:కట్టెల మండిలో భారీ అగ్నిప్రమాదం