తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఎస్సై దంపతులను బలి తీసుకున్న కరోనా - ASI couple died due to corona

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి ఠాణాలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కటారి రాధాకృష్ణ(57) కరోనా బారిన పడి చనిపోయారు. ఆయన భార్య మూడు రోజుల క్రితం కొవిడ్ పొట్టనపెట్టుకుంది.

Bowenpally ASI katari radhakrishna, corona
3 రోజుల క్రితం భార్య.. ఇప్పుడు ఏఎస్సై..

By

Published : Apr 20, 2021, 6:36 AM IST

మూడు రోజుల వ్యవధిలో ఏఎస్సై దంపతులను కరోనా బలితీసుకుంది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి ఠాణాలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కటారి రాధాకృష్ణ(57), ఆయన సతీమణి(55) కరోనా బారిన పడ్డారు. ఇద్దరూ సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఈ నెల 15న ఆయన సతీమణి మృతి చెందగా.. పరిస్థితి విషమించి 18న రాత్రి ఏఎస్సై చనిపోయారు. రాధాకృష్ణది ఏపీలోని ప్రకాశం జిల్లా కాగా.. 1985లో పోలీసు శాఖలో చేరారని బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

పాతబస్తీలో హెడ్‌కానిస్టేబుల్‌...

డబీర్‌పురా ఠాణాకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ జితేందర్‌(53) కరోనాతో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారని సీఐ సత్యనారాయణ తెలిపారు.


ఇదీ చూడండి:'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'

ABOUT THE AUTHOR

...view details