తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 5:10 AM IST

ETV Bharat / state

దత్తత తీసుకొని అభివృద్ధి చేయలేదు: భాజపా అభ్యర్థి

ముఖ్యమంత్రి కేసీఆర్ బౌద్ధనగర్ డివిజన్​ను దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని బౌద్ధనగర్ భాజపా అభ్యర్థి మేకల కీర్తి అన్నారు. డివిజన్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె పాదయాత్ర చేశారు.

boundhanagar bjp corporator candidate mekala keerthi campaign in division
దత్తత తీసుకొని అభివృద్ధి చేయలేదు: భాజపా అభ్యర్థి

తెలంగాణ ప్రభుత్వం కేవలం హామీల వరకే పరిమితమైందని బౌద్ధనగర్ భాజపా అభ్యర్థి మేకల కీర్తి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బౌద్ధనగర్ డివిజన్​ను దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డివిజన్​ పరిధిలోని అంబర్​నగర్​, పార్సిగుట్టలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. భాజపాకు ఓటు వేయాల్సిందిగా కోరారు. డివిజన్​లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తెలిపారు. భాజపా వంద సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

దత్తత తీసుకొని అభివృద్ధి చేయలేదు: భాజపా అభ్యర్థి

ఇదీ చదవండి:జీహెచ్​ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది

ABOUT THE AUTHOR

...view details