రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై లేదని భారతీయ బౌద్ధ సంఘం ఆరోపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేస్తూ... మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారంటూ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు మండిపడ్డారు.
హైదరాబాద్ అబిడ్స్‌లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో మద్యం అమ్మకాలను నియంత్రిస్తుంటే... తెలంగాణలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మద్యం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.