హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయూద్దీన్పై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న కథనాలు అవాస్తవమని తెరాస కార్యకర్తలు ఖండించారు. కులమతాలకతీతంగా బోరబండ డివిజన్‌ను అభివృద్ధి చేశారని అర్చకుల సంఘం పేర్కొంది.
'బోరబండ డివిజన్ అభివృద్ధి.. డిప్యూటీ మేయర్ ఘనతే' - హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయూద్దీన్
కులమతాలకతీతంగా బోరబండ డివిజన్‌ను అభివృద్ధి చేసిన ఘనత డిప్యూటీ మేయర్ బాబా ఫసీయూద్దీన్ది అని బోరబండ అర్చకుల సంఘం ప్రశంసించింది. డివిజన్లోని దేవాలయాలు గతం కన్నా ఇప్పుడే ప్రగతి పథంలో నడుస్తున్నాయని తెలిపారు.
'బోరబండ డివిజన్ అభివృద్ధి.. డిప్యూటీ మేయర్ ఘనతే'
బోరబండలోని దేవాలయాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందాయని అర్చకులు తెలిపారు. తమకు సరైన సమయంలో జీతాలు ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదని కొనియాడారు. కావాలనే కొందరు డిప్యూటీ మేయర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
- ఇదీ చూడండి:అత్యవసరమైతేనే కేసులు విచారిస్తాం: హై కోర్టు