Bookmyshow Tickets Sunburn Festival Hyderabad : హైదరాబాద్‌లో సన్‌బర్న్ న్యూఇయర్ వేడకపై టికెట్లు విక్రయించిన బుక్ మై షో యాజమాన్యం పోలీస్ కేసు నమోదు కావడంతో వెనక్కి తగ్గింది. తన అధికారక వెబ్సైట్లో టికెట్ల విక్రయం నిలిపివేసింది. అనుమతి తీసుకోకుండా ఈవెంట్‌పై టికెట్లను అమ్ముతున్నందున సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Fires on Sunburn Event) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో బుక్‌మై షో టికెట్ల అమ్మకాన్ని ఆపేసింది. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు సన్‌బర్న్ ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌పై కేసుసహా.. బుక్ మై షో ఎండీ, నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం.. బుక్ మై షో సైట్‌లో విశాఖ వేదికగా సన్ బర్న్ న్యూ ఇయర్ వేడుకకు సంబంధించిన సమాచారమే కనిపిస్తోంది.
Sunburn Festival Dispute History: సన్‌బర్న్ ఈవెంట్‌కు వివాదాలు ఇది తొలిసారి కాదు. గతంలో ఇలా చాలా వివాదాలు ఈ ఫెస్టివల్‌ను చుట్టుముట్టాయి. సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. ఈవెంట్లో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో శంషాబాద్‌లో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఓ యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు.
మళ్లీ ఈవెంట్‌ను 2017 సంవత్సరంలోని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు(వీహెచ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2020లోని గోవాలో నిర్వహించినప్పుడు స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో అక్కడ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా తీవ్ర వివాదాల నేపథ్యంలో ఈసారి సన్‌బర్న్ ఫెస్టివల్‌ను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ససేమిరా అంది.
సన్‌బర్న్ ఈవెంట్ వివాదం - బుక్ మై షో ఎండీ, నోడల్ అధికారికి నోటీసులు : మాదాపూర్ అదనపు డీసీపీ