తెలంగాణ

telangana

ETV Bharat / state

సులోచనాదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి - hyderabad ravindra bharathi latest news

హైదరాబాద్​ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్... ప్రముఖ రచయిత్రి సులోచనాదేవి రాసిన 'ఏ బ్రీఫ్​ హిస్టరీ ఆఫ్​ ఆంధ్రప్రదేశ్​ ఎండ్​ తెలంగాణ బిఫోర్​ ఎండ్​ ఆఫ్టర్​ బైఫర్​కేషన్​' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని మంత్రి ఆకాంక్షించారు.

book release in hyderabad ravindra bharathi by minister srinivas goud
సులోచనాదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

By

Published : Oct 28, 2020, 10:17 PM IST

సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంతం... రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అన్నారు. ప్రముఖ రచయిత్రి సులోచనాదేవి రాసిన 'ఏ బ్రీఫ్​ హిస్టరీ ఆఫ్​ ఆంధ్రప్రదేశ్​ ఎండ్​ తెలంగాణ బిఫోర్​ ఎండ్​ ఆఫ్టర్​ బైఫర్​కేషన్​' అనే పుస్తకాన్ని హైదరాబాద్​ రవీంద్రభారతిలోని మంత్రి ఛాంబర్​లో ఆవిష్కరించారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్​ ఉన్నప్పటి పరిస్థితులు ఏంటీ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ స్థితిగతులు ఎలా మారాయి? అనే అంశాలను రచయిత్రి సులోచనాదేవి చక్కగా వివరించారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై భవిష్యత్తులో మరో మంచి పుస్తకం రాయాలని కోరారు.

ఇదీ చూడండి:అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details