హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 1వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో వివిధ ప్రచురణ సంస్థలకు చెందిన 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళం, ఆంగ్లంతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోని రచనల్ని అందుబాటులో ఉంచారు. పిల్లల నుంచి పెద్దల వరకు అవసరమైన అన్ని పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి.
తొలిరోజే సందర్శకులు పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. ఈ ప్రదర్శన కోసం ఎదురుచూస్తామని.. తమకు కావల్సిన పుస్తకాలు అన్నీ ఒకే దగ్గర దొరకడం... రాయితీలు ఇస్తుండటం వల్ల ఇక్కడికి వస్తున్నట్లు సందర్శకులు తెలిపారు.