ఏటా పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు పుస్తక ప్రదర్శన ఉండనుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ ప్రకటించారు.
ఈనెల 23 నుంచి హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్ - hyderabad book fair news
ఏటా నిర్వహించే హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు సాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో ఈసారి 330 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.
![ఈనెల 23 నుంచి హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్ Book Fair in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361623-838-5361623-1576233152719.jpg)
హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్
బుక్ ఫెయిర్‌లో దిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్ తర్వాత తెలంగాణ నాలుగవ స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రదర్శనలో 330 స్టాళ్లు ఉంటాయని.. దేశవిదేశాలకు చెందిన పుస్తక పబ్లిషర్స్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషా పుస్తకాలు లభ్యమవుతాయని అన్ని వర్గాల వారు సందర్శించి బుక్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని గౌరీశంకర్ కోరారు.
హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్
ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?