book fair at hyderabad: గత సంవత్సరం నిర్వహించిన పుస్తక మహోత్సవానికి 11 రోజుల్లో పది లక్షల మంది హాజరయ్యారని నిర్వహకులు తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పబ్లికేషన్ వారితో పాటు, పుస్తక ప్రియులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సారి పుస్తక మహోత్సవానికి మరింత ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్లో జాతీయ పుస్తక మహోత్సవం.. - book fair at hyderabad
book fair at hyderabad: పుస్తక ప్రియులకు అత్యంత ఇష్టమైన జాతీయ పుస్తక మహోత్సవం హైదరాబాద్లో ప్రారంభం కానుంది. 35వ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వహకులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పుస్తక మహోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించారు.
![డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్లో జాతీయ పుస్తక మహోత్సవం.. book fair at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17249162-187-17249162-1671444095193.jpg)
పుస్తక మహోత్సవంలో అనేక కార్యక్రమాల నిర్వహణ కూడా చేపట్టారు. 23వ తేదీన 2.45గంటల నుంచి 3 గంటల వరకు పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, 24వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పప్పెట్ షో, 25వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫ్లాష్ మాబ్, 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు పాటల పోటీలు, 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు డ్యాన్స్ పోటీలు, 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు డ్యాన్స్ పోటీలు, 30వ తేదీన సాయంత్రం 4.15 గంటల నుంచి 5గంటల వరకు కథల పోటీలు, 31వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి 2.45 గంటల వరకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: