covid vaccination: 'టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి' - హైదరాబాద్ పాతబస్తీ
ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పుర పరిధిలోని ప్రభుత్వ ఐటీఐలో కొవిడ్ వ్యాక్సినేషన్(covid vaccination) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీకా కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోని వారు నేరుగా వ్యాక్సిన్ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల వాక్సినేషన్(covid vaccination) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పుర పరిధిలోని ప్రభుత్వ ఐటీఐలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాక్సినేషన్ కేంద్రంలో సుమారు 100 మంది టీకా వేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా డ్రైవర్ల కోసం వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశామని దక్షిణ మండలం ఆర్టీఓ సదానందం తెలిపారు. దక్షిణ మండలంలో ఉండే ఆటో, క్యాబ్ డ్రైవర్లు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని… ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోని వారు నేరుగా వాక్సినేషన్ కేంద్రానికి వచ్చి టీకా వేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:Fire department: '94శాతం మందికి పైగా సిబ్బందికి మొదటి డోసు పూర్తి'