పుర పోరు ప్రచారం ఇవాళ్టితో సమాప్తం అయ్యింది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కార్పోరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పుర పోరుపై... పోలీసుల నిఘా!పురు పోరుపై... పోలీసుల నిఘా! భారీ బందోబస్తు ఏర్పాటు...
పోలీసులతో పాటు అదనపు బలగాలతో బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తం 726 పోలింగ్ కేంద్రాల్లో 197 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందు కోసం 4500 మంది ట్రాఫిక్, సివిల్, ఆర్మ్డ్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 380 మంది తమ ఆయుధాలను సమర్పించారు. 208 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మహేష్ భగవత్ తెలిపారు.
ప్రత్యేక ప్లైయింగ్ టీంల ఏర్పాటు
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం సరఫరాను అరికట్టేందకు ప్రత్యేక ప్లైయింగ్ టీంలు రంగంలోకి దింపారు. మరోవైపు రాచకొండ పోలీసులు కూడా కమిషరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో పోలింగ్ కేంద్రాలు ఉన్నందున వాటి బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. ఎటువంటి అంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసు అధికారులతో చర్చించారు.
ఇదీ చూడండి: భాజపా జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా