హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఎన్‌జీఓ విద్యాశాఖాదికారి కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల్లో జిల్లా డీఈఓ వెంకట నర్సమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బోనం ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి నాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించారు. శివ సత్తుల పునకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది.
బోనం ఎత్తిన జిల్లా విద్యాశాఖాధికారి - డీఈఓ వెంకట నర్సమ్మ
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని తెలంగాణ ఎన్‌జీఓ విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో పాల్గొన్న డీఈఓ వెంకట నర్సమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోనం ఎత్తిన జిల్లా విద్యాశాఖాధికారి