తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశమంతా చాటేలా దిల్లీలో బోనాలు' - K KESHAVA RAO

దిల్లీ తెలంగాణ భవన్​లో లాల్​ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు దేశమంతా చాటేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశవరావు తెలిపారు.

గురువారం పట్టువస్త్రాలు, బోనం సమర్పించనున్నాం : నర్సింగరావు

By

Published : Jul 2, 2019, 9:56 PM IST

లాల్​ దర్వాజ బోనాలు వేడుకలకు 111వ వార్షికోత్సవాలకు గుర్తుగా 111 ఫొటోలతో... దిల్లీ తెలంగాణ భవన్​లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెరాస ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్​, తెలంగాణ భవన్ రెసిడెంట్​ కమిషనర్ వేదాందం గిరి, లాల్​ దర్వాజ ఆలయం ఛైర్మన్​ నర్సింగరావు వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు దేశమంతా చాటేలా... ఐదేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కే.కేశవరావు తెలిపారు. అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తూ... రాష్ట్రాభివృద్ధి ముందుకు సాగేలా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. రేపు సాయంత్రం ఇండియా గేట్ నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తెలంగాణ భవన్​కు తీసుకొచ్చి ఘట స్థాపన చేస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ నర్సింగరావు తెలిపారు. పోతురాజులు, శివసత్తులు ఆహ్వానం పలకగా.. గురువారం పట్టువస్త్రాలు, బోనం సమర్పించనున్నట్లు వివరించారు.

దిల్లీ తెలంగాణ భవన్​లో ఘనంగా లాల్​ దర్వాజ బోనాలు

ABOUT THE AUTHOR

...view details