తెలంగాణ

telangana

ETV Bharat / state

లండన్​లో నిరాడంబరంగా బోనాల పండుగ - bonalu festival in london

లండన్​లో బోనాల పండుగ నిరాడంబరంగా జరిగింది. టాక్(తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్)ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల జాతరను లండన్​లో నిర్వహిస్తారు. కానీ, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో సంబరాలకు దూరంగా ఉన్నారు.

bonalu festival in london
లండన్​లో నిరాడంబరంగా బోనాల పండుగ

By

Published : Jul 21, 2020, 8:58 PM IST

తెలంగాణ సంస్కృతి ఖండంతరాలకు విస్తరించింది. లండన్​లోని తెలంగాణ వారు బోనాల పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. టాక్(తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) కార్యవర్గ సభ్యులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడిలో అమ్మవారికి బోనాలను సమర్పించి అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ సమాచారహక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ బోనాల పాటలతో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారిని అలరించారు. నిరుడు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి పోతరాజు వేషధారణతో లండన్ వీధుల్లో ధూమ్ ధామ్ చేసిన జయ్ కూడా వీడియో కాన్ఫరెన్స్​​లో పోతరాజు వేషధారణతో అమెరికా నుంచి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details