ఆషాఢమాస చివరి దశ బోనాలు నాచారంలో వైభవంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు భక్తులను అలరించాయి. ఆలయ ప్రాంగణంలోని విద్యత్‌దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'నాచారంలో బోనాల సందడి'