కంటోన్మెంట్ పరిధిలోని చారిత్రాత్మకమైన లాల్‌బజార్ మహాంకాళీ బోనాల జాతర ఘనంగా జరిగింది. తిర్మలగిరి,లాల్ బజార్, తదితర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. మహిళలు అమ్మవారికి సాకలు,నైవేద్యాలు,ఒడిబియ్యాలు పోసి మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయం అంతా వివిధ రంగులు,విద్యుత్ దీపాలతో చూపరులను కనువిందుచేస్తోంది. మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు జి.సాయన్న, హనుమంత రావు అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు రంగం కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
'కంటోన్మెంట్లో బోనాల సందడి' - mla
హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని చారిత్రాత్మకమైన మహంకాళీ బోనాల జాతర వైభవంగా జరిగింది. మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'కంటోన్మెంట్లో బోనాల సందడి'