వైభవంగా బల్కంపేట అమ్మవార్ల కల్యాణ ఉత్సవాలు - bonalu in balkampet
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల కల్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.

వైభవంగా బల్కంపేట అమ్మవార్ల కల్యాణ ఉత్సవాలు
వైభవంగా బల్కంపేట అమ్మవార్ల కల్యాణ ఉత్సవాలు
ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం జరిగే అమ్మవారి కల్యాణ ఉత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. సోమవారం గణపతి పూజతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయన్నారు. బుధవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎంవీ శర్మ వెల్లడించారు.
- ఇదీ చూడండి :నిబంధనలు లేని పబ్‌లు... ఆందోళనలో నగరవాసులు
TAGGED:
bonalu in balkampet