bonalu wishes: ఆషాఢమాసం బోనాలను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు అందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం బోనాల శుభాకాంక్షలు - Bonala festival Greetings from cm kcr
bonalu wishes: బోనాల పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ విషెస్.. : బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండవర్ణాల గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఎడతెరిపి లేని వానలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.
ఇవీ చూడండి..లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు