మంగళవారం వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుల్జర్ హౌస్.. తదితర ప్రాంతాల్లో పోలీస్ మార్చ్‌ను నిర్వహించారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు - checking at charminar with bomb squad due to ganesh immersion
హైదరాబాద్ పాతబస్తీలో వినాయకుడి నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు.
![నిమజ్జనోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు checking at charminar with bomb squad due to ganesh immersion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8637920-530-8637920-1598955911223.jpg)
నిమజ్జనోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
కరోనా దృష్ట్యా ఈ ఏడాది ట్రాఫిక్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ప్రధాన రహదారులపై బ్యారికేడ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. నిమజ్జనోత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించే సంబురాలు జరుపుకోవాలని పోలీసులు కోరారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు