నిత్యావసరాలు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ - నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
Hyderabad latest news
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్,అమ్ముగూడా ప్రాంతాల్లోని పేద ప్రజలకు... బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్, స్థానిక తెరాస నేతలు నిత్యావసర సరకులు అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచన మేరకు నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో బియ్యం, కూరగాయలు, వంట సామాను పంపిణీ చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు.