బోయిన్పల్లి అపహరణ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సికింద్రాబాద్ కోర్టు విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.
మరోవైరు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ భర్త భార్గవ్రామ్కు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో భార్గవ్ రామ్‌కు ఎలాంటి సంబంధం లేదని... ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.