తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వినోద్​కుమార్​ కౌంటర్ ఎటాక్​​.. ఏం అన్నారంటే? - Kaleshwaram Project Debts

రాష్ట్రాలు చేస్తోన్న అప్పులపై పార్లమెంట్​లో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​ ఛైర్మన్​ బోయినపల్లి వినోద్​కుమార్​ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల విషయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని పేర్కొన్నారు. చేస్తున్న అప్పులను భవిష్యత్ తరాల కోసం ఆస్తులుగా తయారు చేస్తోందని స్పష్టం చేశారు.

Boinapally Vinod Kumar
Boinapally Vinod Kumar

By

Published : Feb 10, 2023, 9:03 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను క్యాపిటల్ ఇన్వెస్ట్​మెంట్​పై వెచ్చిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక క్రమశిక్షణపై కొన్ని రాష్ట్రాలు గాడి తప్పి వ్యవహరిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై వినోద్ కుమార్ స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని పేర్కొన్న ఆయన.. చేస్తున్న అప్పులను భవిష్యత్ తరాల కోసం ఆస్తులుగా తయారు చేస్తోందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అప్పులను కేవలం క్యాపిటల్ ఇన్వెస్ట్​మెంట్​​పై వెచ్చిస్తోందని.. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్​మెంట్​ రానున్న రోజుల్లో పదింతలు రెట్టింపు విలువను చేయనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అప్పులను తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల కోసం మాత్రమే వెచ్చించిందని తెలిపారు.

తద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, వరి ధాన్యం పండించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్​ను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. భూగర్భంలో దాదాపు 600 టీఎంసీల నీళ్లు భద్రపడి ఉన్నట్లు ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details