తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు.. - బాయిలర్ పేలుడు

Boiler Blasted In Srisailam: ఏపీలోని శ్రీశైలంలో గల దేవస్థాన ప్రాంగణంలో ప్రమాదం సంభవించింది. వంటశాలలోని బాయిలర్​ పేలింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ జరగకపోవటంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు..
శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు..

By

Published : Nov 1, 2022, 5:56 PM IST

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు..

Boiler Blasted In Srisailam: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలం దేవస్థానం అన్నపూర్ణ భవన్ ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. వంటశాలకు చెందిన బాయిలర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. బాయిలర్ పేలడం వల్ల అందులోని ఎస్​ఎస్​ ట్యాంకు సుమారు 10 అడుగుల మేర ఎగిరిపడి.. రేకుల షెడ్డు పైభాగాన్ని బద్దలు కొట్టింది. ఘటనా స్థలం వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

పేలుడు శబ్దానికి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కార్తిక మాసోత్సవాల సందర్భంగా భోజనం, అల్పాహారం వంటివి నిరంతరం తయారు చేయాల్సి రావడంతో అధిక వేడి వల్ల బాయిలర్ పేలుడుకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. బాయిలర్ ప్రక్కనే చిన్నపాటి గ్యాస్ గోడౌన్ ఉంది. అదృష్టవశాత్తు పైకి ఎగిరిన ట్యాంక్​ అటువైపు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details