తెలంగాణ

telangana

ETV Bharat / state

కెరటాలకు ముక్కలైన పడవ.. ప్రాణాలతో బయటపడ్డ మత్య్సకారులు - Boat washed ashore. Everyone is safe

ఏపీలోని విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రెండు రోజుల క్రితం వేటకు బయలు దేరిన బోటు అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది.

boat-collapsed-in-vishaka-fishing-harbour
అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. తప్పిన ప్రమాదం

By

Published : Aug 7, 2020, 9:34 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అన్నవరం సాగర తీరానికి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక బోట్ కొట్టుకొచ్చింది. దీనిని విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రెండు రోజుల క్రితం వేటకు బయలుదేరిన బోటుగా అధికారులు గుర్తించారు.

బుధవారం రాత్రి మత్స్యకారులు సముద్రంలో లంగర్ వేసి నిద్రలోకి జారుకున్నారు. ఈదురుగాలులు ఎక్కువగా ఉండడం వల్ల లంగర్​ తెగిపోయింది. ఈ విషయాన్ని అందులో ఉన్న ఆరుగురు మత్స్యకారులు గమనించలేదు. తీవ్ర గాలులకు పడవ అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది. మత్స్యకారులు తేరుకున్నప్పటికి బోటును అదుపు చేయలేకపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు.

మత్య్సకారులు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు చెందినవారు. అన్నవరం తీరానికి బోటు వచ్చినా.. పోటు కెరటాల ఉద్రిక్తతకు రెండుగా చీలిపోయింది. బోటు యజమాని కోలా నరసింహమూర్తి తీవ్ర ఆవేదన చెందారు. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details