తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టొద్దు' - డిగ్రీ ప్రవేశాల తాజా వార్తలు

డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టవద్దని స్పష్టం చేసింది.

'Board of Higher Education says Private degree colleges have not yet started the admission process'
'ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టొద్దు'

By

Published : Aug 6, 2020, 7:52 PM IST

ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టవద్దని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని పాపిరెడ్డి తెలిపారు. అయితే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తూ.. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యా మండలి ఖరారు చేసే విద్యా సంవత్సరానికి కట్టుబడి ఉండాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తే ప్రైవేట్ డిగ్రీ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని పాపిరెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details