తెలంగాణ

telangana

ETV Bharat / state

TS CETS 2022: ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యా మండలి - ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకం

TS CETS 2022: రాష్ట్రంలో జరగనున్న ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. వివిధ యూనివర్సిటీల ఆచార్యులకు అవకాశం కల్పించింది. ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యతను పలు వర్సిటీలకు అప్పగించింది.

TS CETS 2022: ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యా మండలి
TS CETS 2022: ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యా మండలి

By

Published : Jan 7, 2022, 6:56 PM IST

TS CETS 2022: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యతను పలు వర్సిటీలకు అప్పగించింది. జేఎన్​టీయూహెచ్​కు ఎంసెట్​, ఈసెట్​ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఎంసెట్​ కన్వీనర్​గా జేఎన్​టీయూహెచ్​ రెక్టార్​ గోవర్ధన్​ నియమితులయ్యారు. ఈసెట్​ కన్వీనర్​గా జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ నియామకమయ్యారు.

లాసెట్​, పీజీఎల్​సెట్​, పీజీఈసెట్​, ఎడ్​సెట్​ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీ అప్పగించింది. లాసెట్, పీజీఎల్ సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ జీబీ రెడ్డి నియమితులు కాగా.. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ ఏ.రామకృష్ణ నియామకమయ్యారు. పీజీ ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ నియమతులయ్యారు.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఐసెట్ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి అప్పగించింది. ఐసెట్​ కన్వీనర్​గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డిని నియమించింది. ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details