పూలు, పండ్లతో ప్రకృతి ఛాయ్... తాగేసేయ్ పని ఒత్తిడి ఎక్కువైనా... సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతున్నా... ఓ కప్పు టీ కడుపులో పడితే కలిగే ఆనందమే వేరు. రోజూ ఒకే టీ తాగితే ఏముంటుంది మజా. రోజుకో వెరైటీ అయితే బాగుుటంది కదా. ఇలాంటి వారి కోసమే కొత్తకొత్త రుచులు పరిచయం చేస్తోంది నీలిమ.
సరికొత్తగా పూలు పండ్లతో పరిచయం చేసింది. ఎగ్జోటిక్ బ్లూమింగ్ టీ పేరుతో విదేశాల్లో ఎక్కువగా లభించే ప్రకృతి టీలను మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జాస్మిన్, హైబిస్కస్, రోజ్ ఇలా ఒకటేమిటీ వాటిలో ఫ్లేవర్లు కలిపి ముప్పైకి పైగా పూల టీలను ఆస్వాదించే అవకాశం కల్పించింది.
ఈ కథనం చదవండి: మగువల మనసు దోచే గాజులు
రెడి టూ డ్రింగ్ టీ:
ఎక్జోటిక్ బ్లూమింగ్ టీలలో వాడే పూలు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం నగరంలో మొత్తం మూడు స్టోర్లతో పాటు.... ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ క్యాంపస్‌లో నీలిమ నిర్వహిస్తున్న స్టోర్ మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఒకప్పుడు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఈ బ్లూమింగ్ టీలలో సొంతంగా వివిధ రకాల ఫ్లేవర్లతో బ్లెండ్ చేసి అందించటం నీలిమ ప్రత్యేకత. అంతేకాదు దీపావళి కోసం ప్రత్యేకంగా స్నేహితులు, బంధువులకు కానుకలుగా ఇచ్చేందుకు కప్‌లలో రెడీ టూ డ్రింక్ టీలను గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తోంది. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన టీల రుచినే కాదు... వాటిలోని సుగుణాలను సైతం మనవారికి అందించాలన్న లక్ష్యంతోనే ఈ వ్యాపారం ప్రారంభించానంటోంది నీలిమ.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా:
ఈ వ్యాపారం అంత సులభం కాదంటున్నారు నీలిమ. వినూత్న ఆలోచన, మార్కెటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా వంద స్టోర్లను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చెబుతోంది.
ఈ కథనం చదవండి: అవును.. ఈ పువ్వులు వాడిపోవు