రాష్ట్రంలో కొవిడ్-19 కారణంగా రక్త నిల్వలు తగ్గాయని... వాటిని పెంచేందుకు రాష్ట్ర యాదవ సంఘం ముందుకొచ్చింది. తమ సంఘం ద్వారా రాష్ట్రానికి మొత్తం 50 వేల యూనిట్ల రక్తాన్ని ఇచ్చేందుకు యాదవులంతా ముందుకు రావాలని రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సి.బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పద్మశాలి కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 150 దాతలు పాల్గొని 150 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
వెస్ట్ మారేడ్‌పల్లిలో రక్తదాన శిబిరం - వెస్ట్ మారేడ్‌పల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు
కరోనా కారణంగా తగ్గిన రక్త నిల్వలతో ఏ ఒక్క రోగి ప్రాణాలు విడవొద్దని కోరుతూ... సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పద్మశాలి కల్యాణ మండపంలో రాష్ట్ర యాదవ సంఘం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
వెస్ట్ మారేడ్‌పల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు
ప్రతి జిల్లా నుంచి సుమారు వెయ్యి, పదిహేను వందల యూనిట్ల రక్తం వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి దశలవారీగా 50 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వానికి అందించనున్నట్లు బద్రీనాథ్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'