హైదరాబాద్ జవహర్‌నగర్‌లో అయ్యప్ప సేవా సమితి, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు దాదాపు 100 మంది రక్తం దానం చేశారు. దాతలను అభినందించిన మంత్రి వారికి ప్రశంస పత్రాలను అందచేశారు. కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్ని సందర్శించిన మంత్రి మల్లారెడ్డి - JAWAHAR NAGAR, HYDERABAD
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని సందర్శించిన మంత్రి మల్లారెడ్డి దాతలకు ప్రశంసా పత్రాలను అందించారు.
రక్త దాతలకు ప్రశంస పత్రాలను అందించిన మంత్రి మల్లారెడ్డి