సికింద్రాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను మల్కాజిగిరి తెరాస ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న రెడ్‌క్రాస్ సంస్థను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరం - హైదరాబాద్ జిల్లా వార్తలు
సికింద్రాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. మల్కాజిగిరి తెరాస ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న రెడ్‌క్రాస్ సంస్థని అభినందించారు.
సికింద్రాబాద్‌లో రక్తదాన శిబిరం
రక్తదానం ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. రక్తదానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని ఇలాంటి కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష: కేజ్రీవాల్